Thursday, March 19, 2026
HomeసినిమాBatukamma: బతుకమ్మ ఆడిన భూమిక, పూజ హెగ్డే

Batukamma: బతుకమ్మ ఆడిన భూమిక, పూజ హెగ్డే

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’.  విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో  ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయడం మరో విశేషం. సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ కు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే చరణ్‌ అడిగిన వెంటనే చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో ఓ సాంగ్ లో కనిపించారు. ఇప్పుడు సల్మాన్  కోరిక మేరకు కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రంలో చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

 ఈ సినిమా నుంచి  ఓ పాటను రిలీజ్ చేశారు. అది బతుకమ్మ పాట కావడం విశేషం. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవన చిత్రం తెలుగు సినిమాల్లో కథావస్తువు అయింది. తెలంగాణ మెయిన్ థీమ్ గా మారుతోంది. ఇక, బాలీవుడ్ కూడా తెలంగాణ సంస్కృతికి జై కొడుతోంది. తెలంగాణ బతుకమ్మ పండుగ ఒక బడా హిందీ సినిమాలో చూస్తామని ఎవరూ ఊహించి ఉండరు కానీ, సల్మాన్ ఖాన్ వల్ల సాధ్యమవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ తెలంగాణకి చెందిన ఒక ధనవంతుడిగా నటిస్తున్నారు. అతని చెల్లెలుగా పూజ హెగ్డే నటిస్తోంది. భూమిక వెంకటేష్ భార్యగా నటిస్తోంది. సో… సినిమాలో వీరి పై ఒక బతుకమ్మ పాట తీశారు. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ పాటని విడుదల చేశారు.

నార్త్ వాళ్లకు నచ్చేవిధంగా కొంత కలర్ ఫుల్ గా, గ్రాండ్ గా మార్చేశారు బతుకమ్మ ఆటని. పూజ హెగ్డే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది కానీ ఆమె ఏ తెలుగు సినిమాల్లో బతుకమ్మ ఆడే సీన్ చెయ్యలేదు. ఇప్పుడు హిందీ సినిమాలో చేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular