Sunday, November 24, 2024
HomeTrending NewsBC Gurukul: మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు

BC Gurukul: మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు

వెనుకబడిన వర్గాలను అన్నిరంగాల్లో అభివ్రుద్ది చేసే సంకల్పంతో కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుంది, తాజాగా 17 నూతన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేసారు. నూతన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే తరగతుల ప్రారంభానికి ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలియజేసారు.

గతంలో వర్గల్ కాలేజికి అదనంగా 2022 – 23 విద్యా సంవత్సరంలో నూతనంగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకొని క్లాసులను ప్రారంభించుకున్నామన్నారు. ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలున్నాయని తాజాగా జిల్లాకొక డిగ్రీ కాలేజీకి ముఖ్యమంత్రి అనుమతిస్తూ మరో 17 డిగ్రీ కాలేజీలను ఏర్పాటుకు మార్గం సుగమం అయిందన్నారు.  గత విద్యా సంవత్సరంలోనే నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33 కొత్త గురుకులాల్ని సైతం ప్రారంభించామన్నారు.

గతంలో కేవలం 19 గురుకులాలు, 7000మంది విద్యార్థులకు మాత్రమే గురుకుల విద్య అరకొరగా అందుతుండేదన్నారు. గురుకులాలను దశలవారిగా 261కి అనంతరం 310కి నేటి పెంపుతో ఏకంగా 327కు బీసీ గురుకులాలను పెంచిందన్నారు. బీసీ గురుకులాల్లో ప్రతీ ఏడు ఇంగ్లీష్ మీడియంలో చదివిన 1,68,000 పైచీలుకు వెనుకబడిన వర్గాల బిడ్డలు నేడు అన్ని పోటీపరీక్షల్లోనూ తమ సత్తా చాటడం సంతోషంగా ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్