Wednesday, March 11, 2026
HomeTrending Newswar on congress: బీసీలను కించపరిస్తే అంతు చూస్తాం - బిఆర్ ఎస్

war on congress: బీసీలను కించపరిస్తే అంతు చూస్తాం – బిఆర్ ఎస్

బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లు హెచ్చరించారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో పలువురు బిసి ప్రజాప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, ఎల్.రమణ, బసవరాజ్ సారయ్య, శంభీపూర్ రాజు, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, MP లు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బిబి పాటిల్, కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ లతో పాటు ఇంకా పలువురు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిసిలు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బిసిల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించడంతో పాటు నిధులను కూడా ఇచ్చిందని చెప్పారు. అదేవిధంగా కులవృత్తులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తూ వస్తుందని వివరించారు. అనేక విధాలుగా తమ ఎదుగుదలకు అండగా నిలిచినా BRS పార్టీ వెంట ఉన్నారని, దీన్ని జీర్ణించు కోలేక బిసిల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.

వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజులలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు గల అన్ని బిసి సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి ఏకం చేస్తామని, త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ను రూపొందించి ప్రకటిస్తామని చెప్పారు. మా ఓట్లతో గెలిచి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గ్రామాలలో తిరగనీయకుండా అడ్డుకుంటామన్నారు. బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. తమ జోలికి వస్తే అన్ని బిసి సామాజిక వర్గాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయని హెచ్చరించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. బిసిలు జనాభాలో 56 శాతం ఉన్నారన్న విషయాన్ని మరచిపొవద్దని, రానున్న రోజులలో మా సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular