Sunday, January 19, 2025
HomeTrending Newsవిదేశీయులతో అప్రమత్తంగా ఉండాలి

విదేశీయులతో అప్రమత్తంగా ఉండాలి

Be Vigilant With Foreigners :

కొత్త వేరియంట్ పై అప్రమత్తమయ్యామని, గుంగుంపులుగా ఉండొద్దు. జనాలు జాగ్రత్తగా ఉండాలి ..మాస్క్ తప్పనిసరిగా వాడాలి.. భౌతిక దూరం పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కేసులు తగ్గాయని.. జనాల్లో నిర్లక్ష్యం వచ్చిందన్నారు. కానీ.. మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చిందని, ఒమిక్రాన్ వైరస్ కొన్నిదేశాల్లో మాత్రమే వ్యాపిస్తోందన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి.. కొత్త మ్యుటేషన్ మన దగ్గర ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్నారు.

కోవిడ్ ప్రభావం తగ్గింది కానీ.. కనుమరుగు కాలేదని, ప్రభుత్వం తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కోరారు. కొత్త వేరియంట్ లక్షణాలు కూడా సేమ్ ఉంటాయని, డెల్టా వేరియంట్ కంటే… 30 శాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. థర్డ్ వేవ్ లో కేవలం చిన్నపిల్లలకు సోకుతుంది అనే అపోహ వీడండి. పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిన్నపిల్లలకు కరోనా సోకుతుంది కానీ… తీవ్రత ఎక్కువగా ఉండదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా జరగలేదన్నారు.

ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అంక్షలు

72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపిసిఆర్ టెస్టు నెగిటివ్ తప్పని సరి. విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యక మరోమారు పరిక్షలు. ప్రయాణికుల పరిక్షలకోసం మరో రెండు కేంద్రాలు. దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపిసిఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని ఎయిర్ పోర్ట్ ఆధికారులు స్పష్టం చేశారు. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక మరోమారు పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ గా తెలినవారిని హోం క్వారంటైన్ లో లేదా ఆస్పత్రిలో చేరాలని ఆధికారులు ఫోన్ చేసి చెబుతున్నారు.

దక్షణాఫ్రికా, జింబాబ్వే, సమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం, తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపిసిఆర్ పరిక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరిక్షలో నెగిటివ్ అని తేలితేనే ఎయిర్ పోర్ట్ లో నుండి వెలుపలికి అనుమతినిస్తున్నారు. లేదంటే క్వారెంటైన్ కు తరలిస్తారు. ప్రయాణికులకు పరిక్షలు చేసేందుకు ఎయిర్ పోర్ట్ లో మరో రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read :  ఒమిక్రాన్‌..ఆంక్షలు షురూ..

RELATED ARTICLES

Most Popular

న్యూస్