Sunday, January 19, 2025
HomeTrending Newsమాది ప్రోగ్రెస్ రిపోర్ట్ - బాబుది బోగస్ రిపోర్ట్: సిఎం జగన్

మాది ప్రోగ్రెస్ రిపోర్ట్ – బాబుది బోగస్ రిపోర్ట్: సిఎం జగన్

నాయకుడంటే ప్రజలకు విశ్వాసం ఉండాలని, హామీ ఇస్తే అమలు చేస్తాడన్న నమ్మకం కలగాలని… ఈ విషయంలో ఎవరు ఎలాంటి నాయకుడో ఆలోచించిన తర్వాత మాత్రమే ఓటు వేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలో బాబు పాలన, 58 నెలలుగా తన పారిపాలనలో వివిధ వర్గాలకు చేసిన మంచి విషయంలో ఎవరి రిపోర్ట్ ఏమిటో చూడాలని కోరారు. తమది ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే బాబుది బోగస్ రిపోర్ట్ అంటూ అభివర్ణించారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరు బహిరంగసభలో ప్రసంగించారు. బాబుకు మళ్ళీ ఓటేస్తే ఆయనలోని చంద్రముఖి నిద్ర లేస్తుందని హెచ్చరించారు.

బాబు హయంలో కేవలం 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తాము వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వ్యవసాయం దండుగ అని బాబు మాట్లాడారని, బషీర్ బాగ్ లో కాల్పులు జరిపారని.. కానీ రైతులకు తాము పెట్టుబడి సాయం అందించామని తెలిపారు.

అభివృద్ధి విషయంలో చంద్రబాబు కింగ్ అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటారని.. కానీ ఇది అసత్యమని… నాడు-నేడు తో ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు, ఆస్పత్రుల్లో వసతుల కల్పన,  గ్రామాల్లో 11 వేల ఆర్బీకెలు , డిజిటల్ లైబ్రరీలు,  ఫిషింగ్ హార్బర్ లు , ఇండస్ట్రియల్ కారిడార్లు, వెలిగొండ ద్వారా ప్రకాశం జిల్లాకు తాగునీరు, పొలాలకు నీరు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, 17 మెడికల్ కాలేజీలు లాంటివి తమ హయంలో జరిగిన అభివృద్ధి అయితే… బాబు హయంలో జరిగింది బోగస్ అభివృద్ధి అని జగన్ విమర్శించారు.

మహిళా సాధికారత, అక్క చెల్లెమ్మల అభివృద్ధి విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్నారు.  2 లక్షల 70వేల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా నేరులా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపామని వివరించారు. పేదరికం సంకెళ్లను తెంచుతూ పిల్లల చదువులను బాగు చేసింది తామేనని స్పష్టం చేశారు.

చంద్రబాబు చేసిన వెధవ పనికి అవ్వాతాతలంతా ఆయన్ను తిట్టుకుంటున్నారని, బోగస్ బాబు చేయించిన ఫిర్యాదులతోనే పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని…. కుట్రలు ఆయన చేస్తూ.. ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్