Tuesday, March 10, 2026
HomeTrending Newsరైతులకు అన్యాయం చేయొద్దు: హరీష్ రావు

రైతులకు అన్యాయం చేయొద్దు: హరీష్ రావు

కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని, కాళేశ్వరం అంటే 3బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు వివరించారు. అసెంబ్లీ  మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నామని, అధికారపక్షం మాట్లాడి,  తమకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ప్రభుత్వం తీరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒక బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు. ‘మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండి’ అంటూ సిఎం, కాంగ్రెస్ నేతలకు సూచించారు.  కాళేశ్వరం ఫలితాలు రైతును అడగాలాని, కర్ణాటక నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూసి అద్బుతం అని మెచ్చుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు.

చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు సృష్టించారని, కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత-చేవెళ్ల ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.  తాము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళున్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి నీరు అందించామని వివరించారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లేనని స్పష్టం చేశారు.  ‘తప్పు జరిగితే చర్య తీసుకోవచ్చని, పునరుద్దరణ పనులు చేయాలని కానీ దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదని విమర్శించారు.  రైతులకు ఇబ్బంది పెట్టవద్దని, ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలి 20 మంది చనిపోయారని,  దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయని… అలాంటి ఘటనలు జరగటం బాధాకరమే అయినా ముందుకు వెళ్ళామని పేర్కొన్నారు. ప్రాజెక్టులు అప్పగించ వద్దని మేము నిద్ర లేపితే లేచారాణి, ఈరోజు తమ సభ పెట్టుకుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం పోటీ కార్యక్రమం పెట్టారని ఆక్షేపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular