Friday, September 20, 2024
Homeసినిమాఅలా చేస్తే 'ఆదిపురుష్' సంచలనమే సృష్టించేదేమో!

అలా చేస్తే ‘ఆదిపురుష్’ సంచలనమే సృష్టించేదేమో!

ప్రభాస్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు నిన్న ‘ఆదిపురుష్’ సినిమా వచ్చింది. ఇది రామాయణం కావడం వలన, ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు..  అందరూ ఎదురుచూశారు. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి తెరపై ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారో అనే ఆసక్తితో అంతా థియేటర్స్ కి వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లో .. ఏ స్క్రీన్ పై చూసినా ఇదే సినిమా.

ఇంతగా ప్రేక్షకులు ఆసక్తిని చూపించిన ఈ సినిమాను, వాళ్ల అంచనాలకు తగినట్టుగా దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించాడా అంటే .. లేదనే చెప్పాలి. రామాయణ కథను ఇప్పటి టెక్నాలజీని జోడించి చెబితే బాగుండేది. కానీ ఇప్పటి జనరేషన్ కి రామాయణాన్ని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో దర్శకుడు పొరపాటు చేశాడు. రాముడి మేనిఛాయ దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రతి విషయంలోను పొరపాట్లు చేస్తూ వెళ్లాడు. బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు ‘హా సీతా .. హా లక్ష్మణా’ అని అరవడు … ‘శేషు .. శేషు’ అని పిలుస్తాడు. లక్ష్మణుడు ఆదిశేషుడి అంశానే కావొచ్చు .. కానీ ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

రాముడు – సుగ్రీవుడు,  వాలి – సుగ్రీవుడు, రాముడు – శబరి, రావణుడు – విభీషణుడు, రాముడు – రావణుడు.. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఎపిసోడ్స్. ఒక సీన్ లో తేల్చిపారేసేవి కాదు. ఇక సీతాదేవిని దర్శకుడు ఒక సాధారణమైన స్త్రీగా మాత్రమే భావించడం మనసుకి కాస్త కష్టాన్ని కలిగిస్తుంది. ఇక రావణుడికి సైన్యం ఉండదు .. రథాలతో కూడా ఆయనకి పనిలేదు. లేటెస్ట్ టెక్నాలజీతో రాముడిపై విరుచుకుపడతాడు. ఇక అన్నిటికంటే చిత్రమేమిటంటే, సాంఘిక చిత్రాల్లో హీరో – విలన్ మాదిరిగానే రామ – రావణ పాత్రలను భుజబల ప్రదర్శనకి దింపడం. నిజానికి ఈ సినిమాను ఉన్నది ఉన్నట్టుగా తీసి ఉంటే సంచలనం సృష్టించేదేమో. అలా చేయకపోవడం వల్లనే ఇన్ని విమర్శలు .. ఇన్ని మీమ్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్