Friday, March 20, 2026
Homeసినిమాబెల్లంకొండ గణేశ్ కి ఈ సినిమా కీలకమే!

బెల్లంకొండ గణేశ్ కి ఈ సినిమా కీలకమే!

దూకుడు పెంచడానికి సిద్ధమవుతున్న యంగ్ హీరోల జాబితాలో బెల్లంకొండ గణేశ్ కూడా కనిపిస్తున్నాడు. ఆయన రెండో సినిమాగా రావడానికి ‘నేను స్టూడెంట్ సర్’ రెడీ అవుతోంది. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో ఆయన కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. కంటెంట్ ఏమిటనేది ఆల్రెడీ ట్రైలర్ లోనే రివీల్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడే యువకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

బెల్లంకొండ గణేశ్ అన్నయ్య శ్రీనివాస్ మాస్ యాక్షన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మాస్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ముందుకు వెళుతున్నాడు. అందుకు తగిన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నాడు. టాలీవుడ్ సునీల్ శెట్టి అనిపించుకున్నాడు. కానీ అందుకు పూర్తి భిన్నంగా బెల్లంకొండ గణేశ్ ‘స్వాతిముత్యం’ అనే సినిమాలో చాలా సాఫ్ట్ కేరక్టర్ తో ఎంట్రీ ఇచ్చాడు. కుర్రాడు కాస్త అమాయకంగా కనిపిస్తున్నాడు .. అందుకు తగిన పాత్రలో మెప్పించాడని ఆడియన్స్ చెప్పుకున్నారు.

కానీ ఇప్పుడు బెల్లంకొండ గణేశ్ అందుకు పూర్తి భిన్నమైన కథాంశంతో ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా చేశాడు. ఈ సినిమాలో కథ ఆరంభంలో అతను కాస్త అమాయకంగా కనిపించినా, పరిస్థితులను బట్టి చెలరేగిపోతాడు. ఆయన పాత్రకి యాక్షన్ టచ్ ఇవ్వడమే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఈ తరహా పాత్రలో ఆయన ఎంతవరకూ మెప్పిస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. ఒడ్డూ పొడుగూ బాగానే ఉంటాడు గనుక, ఇక చేయవలసింది పాత్ర ప్రవేశమే. జూన్ 2వ తేదీన థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, కెరియర్ పరంగా ఆయనకి కీలకమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular