Tuesday, March 17, 2026
Homeసినిమాబెల్లంకొండ శ్రీనివాస్ ఇక స్పీడ్ పెంచాల్సిందే! 

బెల్లంకొండ శ్రీనివాస్ ఇక స్పీడ్ పెంచాల్సిందే! 

బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫస్టు సినిమాతోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి తన సినిమాల్లో మాస్ కంటెంట్ ఉండేలా చూసుకుంటూ వెళ్లాడు. కథాకథనాల సంగతి అలా ఉంచితే, తన సినిమాల భారీతనం ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో కూడా స్టార్ హీరోయిన్స్ మెరిసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. బెల్లంకొండను హీరోగా ఆడియన్స్ త్వరగా రిసీవ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే ఆయన కటౌట్ కూడా ఉండటం మరింత ప్లస్ అయింది.

హీరోగా అతనిని ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఒక సినిమా తరువాత ఒకటిగా ఆయన చేసుకుంటూ వెళుతున్నాడు. ‘రాక్షసుడు’ వంటి హిట్ పడిన తరువాత ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగు ఆడియన్స్ తో గ్యాప్ పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ఆయన ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం కావాలని అనుకున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే తన మార్కెట్ పెంచుకోవడానికి బెల్లంకొండ తీసుకున్న ఈ నిర్ణయం తేడా కొట్టేసింది.

‘ఛత్రపతి’ సినిమా వచ్చిన చాలా కాలం తరువాత రీమేక్ చేయడం .. అప్పటికే ఆ కంటెంట్ కి దగ్గరగా ఉన్న మరికొన్ని కథలు బాలీవుడ్ లో రావడం … ఈ సినిమా నిర్మాణంలో ఆలస్యం కావడం ఇవన్నీ కూడా ఆ సినిమా పరాజయంపాలు కావడానికి కారణమయ్యాయి. దాంతో బాలీవుడ్ ప్రయత్నం ఫలించకపోవడం .. తెలుగులో గ్యాప్ రావడం జరిగిపోయింది. ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తూనే, తెలుగు ప్రాజెక్టులను కూడా ఆయన లైన్లో పెట్టుకుని ఉంటే బాగుండేది. అలా చేయడకపోవడం మైనస్ అయింది. ఇక ఇపుడైనా ఆయన తన స్పీడ్ పెంచాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular