Saturday, November 23, 2024
HomeTrending Newsలక్షలాది మందికి పెన్షన్ల లబ్ధి

లక్షలాది మందికి పెన్షన్ల లబ్ధి

సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 65 ఏళ్ళ నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీ ఓ 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది. సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు అందించాలని అందులో serp సీఈఓ ఇతర అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ జీ ఓ లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఈ నిర్ణయంతో కొత్తగా లక్షలాది మందికి ప్రతినెలా రూ. 2016/- వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు తమ శాఖ అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65 ఏ0డ్లు నిండిన అర్హత ఉన్న వాళ్ళందరికీ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. వృద్ధాప్య పెన్షన్ల కు వయోపరిమితిని తగ్గిస్తూ జీ ఓ జారీ చేసిందులకు మంత్రి cm కెసిఆర్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్