Sunday, January 19, 2025
Homeసినిమానాగార్జునతో మోహనరాజా మూవీ ఏమైంది..?

నాగార్జునతో మోహనరాజా మూవీ ఏమైంది..?

నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీతో దసరాకి ప్రేక్షకుల ముందకు వచ్చారు. ఈ సినిమా చాలా అంచనాలతో రిలీజైనప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అయితే.. నెక్ట్స్ మూవీని డైరెక్టర్ మోహనరాజాతో చేయనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ టైమ్ లో మోహనరాజా కూడా నాగార్జునతో మూవీ చేయనున్నానని చెప్పడంతో త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే.. ఇప్పట్లో ఈ సినిమా ఉండదని తెలిసింది. మోహనరాజా హిందీ మూవీ చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారని తెలిసింది.

మరి.. నాగార్జున నెక్ట్స్ మూవీని ఎవరితో చేయనున్నారంటే.. సక్సెస్ ఫుల్ రైటర్ బెజవాడ ప్రసన్నతో అని టాక్ వినిపిస్తోంది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన సినిమాలకు కథ, మాటలు అందించే బెజవాడ ప్రసన్న నాగార్జున కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. ఈ కథ నాగార్జునకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే.. ఈ మూవీని డైరెక్ట్ చేయడం కోసం ఒకరిద్దరు దర్శకులను అనుకున్నప్పటికీ సెట్ కాలేదట. దీంతో బెజవాడ ప్రసన్న రాసిన కథను వేరే డైరెక్టర్ తో తెరకెక్కించడం కన్నా.. ప్రసన్నకే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే.. బాగుంటుందని ఫిక్స్ అయ్యారట నాగార్జున.

ప్రసన్న కూడా ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు. అందుచేత నాగార్జున నుంచి ఇలాంటి ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ మూవీని ఏ బ్యానర్ లో నిర్మిస్తారనేది తెలియాల్సివుంది. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ నాగార్జున ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్