Sunday, January 19, 2025
Homeసినిమాప్రేక్షకుడిని నవ్వించాలని సినిమా చేశాం - శ్రీ సింహా

ప్రేక్షకుడిని నవ్వించాలని సినిమా చేశాం – శ్రీ సింహా

శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. ఈనెల 7న భాగ్ సాలే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ క్రమంలో హీరో శ్రీసింహా మీడియాతో మాట్లాడుతూ “మేం ఏదో సందేశాన్ని ఇవ్వాలని ఈ సినిమాను చేయలేదు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలని చేశాం.వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుని బయటకు వచ్చారు. మేం అనుకున్నదే జరిగింది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.

అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. నేను మా అన్నతో కలిసి పని చేయాలని అనుకోలేదు. నా సినిమా దర్శకులే కాళ భైరవను ఎంచుకుంటారు. మా డైరెక్టర్ ప్రణీత్ ఎప్పుడూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తుంటాడు. సెట్స్‌కు వెళ్లే ముందే పదిహేను వర్షన్స్ రాసుకున్నారు. ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్‌లో బెటర్మెంట్ చూస్తుంటాడు. అదే ఆయన బలం. ఈ చిత్రంలో హీరో పాత్రలోనే కామెడీ ఉంటుంది. దీనిని క్రైమ్ కామెడీ జానర్‌లో తీసినా కూడా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాము”అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్