Saturday, November 23, 2024
Homeసినిమా‘తగ్గేదే లే’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎంఈఐఎల్ పీపీరెడ్డి

‘తగ్గేదే లే’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎంఈఐఎల్ పీపీరెడ్డి

టాలీవుడ్‌లో కొత్త బ్యానర్ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి ప్రారంభించిన భద్ర ప్రొడక్షన్‌ను ఎంఈఐఎల్ పీపీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా ‘తగ్గేదేలే’ అనే ప్రాజెక్ట్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగబాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటించారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ “మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విని ఉంటాం. అలాంటి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మా మొదటి చిత్రం కాన్సెప్ట్ బేస్డ్‌గా రాబోతోంది. శ్రీనివాసరాజు, ఆయన టీం వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది” అన్నారు.

మరో నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ “భద్ర ప్రొడక్షన్ బ్యాన‌ర్ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన అతిథుల‌కు, మీడియాకి ధ‌న్య‌వాదాలు. స‌రికొత్త కాన్సెప్టుల‌తో సినిమాలు తీయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను స్థాపించాం. అందులో మొద‌టి ప్ర‌య‌త్నంగా ‘తగ్గేదేలే’ తో మీ ముందుకు వ‌స్తున్నాం. మీ అంద‌రి బ్లెసింగ్స్ ఉండాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ “భద్ర ప్రొడక్షన్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద బ్యానర్. ఈ బ్యానర్‌కు సంబంధించిన అన్ని విషయాలను నన్ను చూసుకోమ్మని చెప్పిన నిర్మాతలు పీపీ రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రేమ్ కుమార్ గారికి థ్యాంక్స్. దండుపాళ్యం సినిమాను తీసిన శ్రీనివాస రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఆ గ్యాంగ్‌తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ చిత్రంతో ప్రొడక్షన్ కంపెనీ ఎక్కడా కూడా తగ్గేదేలే” అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాస రాజు మాట్లాడుతూ “భద్ర ప్రొడక్షన్‌ను లాంచ్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ఇంత పెద్ద బ్యానర్‌లో నన్ను దర్శకుడిగా తీసుకున్నందుకు థ్యాంక్స్. వారు తలుచుకుంటే ఎంతో పెద్ద చిత్రాలను తీయగలరు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయాలని అనుకున్నారు. టైటిల్ కోసం చాలా ఆలోచించాం. ఈ టైటిల్ చెప్పింది నిర్మాత గారే.. ఇలాంటి టైటిల్ ఇచ్చినందుకు థ్యాంక్స్”  అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్