Bhagath Singh Nagar Getting Ready To Release In This Month :
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధృవిక హీరోహీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను ప్రకాష్ రాజ్ విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి హైప్ రావడం జరిగింది. అలాగే భగత్ సింగ్ నగర్ నుంచి విడుదల అయిన మొదటి ‘చరిత చూపని’ లిరికల్ సాంగ్ కు 1మిలియన్ + వ్యూస్ సాధించింది. త్వరలో మిగిలిన పాటలు విడుదల చేసి ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు
చిత్ర నిర్మాతలు రమేష్ వుడుత్తు, వాలాజా గౌరిలు మాట్లాడుతూ “దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి. ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మాకెంతో గర్వంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల చేస్తాం” అన్నారు.
చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ “భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. నాకు భగతసింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే.. ఎంత బాగుండేదో అనుకునే వాన్ని. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో… సాటి మనిషికి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలనుకునే గొప్ప వ్యక్తి. అలాంటి మంచి ఆలోచనతో ఈ సినిమా తీస్తున్నాం. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
Must Read :త్వరలో రానున్న ‘భగత్ సింగ్ నగర్’