Friday, March 13, 2026
Homeసినిమా'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘భగవంత్ కేసరి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ డెడ్లీ కాంబినేషన్‌ లో చిత్రం ‘భగవంత్ కేసరి’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

సినిమా ఫస్ట్‌ గ్లిమ్ప్స్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్‌ వచ్చింది. బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ అలరించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular