బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తే.. కూతురుగా శ్రీలీల నటించింది. బాలయ్య మార్క్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ కలిసి రూపొందుతున్న ఈ క్రేజీ సినిమా పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్లోకి వస్తుందా నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో బాలయ్య రాజకీయంగా బిజీ అయ్యారు. దీంతో భగవంత్ కేసరి ప్రకటించినట్టుగా దసరాకి అక్టోబర్ 19న థియేటర్లోకి వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే… ఈ మూవీ రిలీజ్ కావడం లేదని.. వాయిదా పడడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ మూవీ టీమ్ మెంబర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం.. ఖచ్చితంగా చెప్పిన డేట్ కే భగవంత్ కేసరి చిత్రం రిలీజ్ కానుందని తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మరి.. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.