Sunday, September 8, 2024
Homeసినిమా'భగవంత్ కేసరి' అప్ డేట్....

‘భగవంత్ కేసరి’ అప్ డేట్….

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్,  కూతురుగా శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న బాలయ్య  సినిమా కావడం, వరుస విజయాలతో ఉన్న అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

భగవంత్ కేసరి అప్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బాలయ్య, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్, కొంత మంది ఫైటర్స్ పై భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్. వెంక‌ట్ మాస్ట‌ర్ ఈ ఫైట్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తైన తర్వాత హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్లో ఓ పాటను చిత్రీకరించనున్నారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఈ భారీ చిత్రానికి ఎస్ఎస్  థమన్ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. త్వ‌ర‌లో ఓ పాట‌ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఇందులో బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం. కథ కూడా ఇప్పటి వరకు బాలయ్య చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందట. బాలయ్య స్టైల్ లో ఉంటూనే అనిల్ రావిపూడి మార్క్ కూడా కనిపిస్తుందట. ఖచ్చితంగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధించడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. దసరాకి ఈచిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్