Saturday, January 18, 2025
Homeసినిమాథియేటర్లను దడ దడ లాండించే దసరానే ఇది!

థియేటర్లను దడ దడ లాండించే దసరానే ఇది!

దసరా పండుగకి ఒక ప్రత్యేకత ఉంది .. ఇది పెద్ద పండుగలలో ఒకటి. ఈ పండుగకి సెలవులు కూడా కాస్త ఎక్కువగానే దొరుకుతాయి. ఇక ఈ పండుగ రోజులను తమ వాళ్లతో గడపాలనే ఉద్దేశంతో ఎవరికి వారు తమ సొంత ఊళ్లకు వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్లిన తరువాత అంతా కలిసి సినిమాలను చూడటం జరుగుతూనే ఉంటుంది. అందువల్లనే దసరా పండుగ సీజన్ లో ఎక్కువ సినిమాలు బరిలోకి దిగిపోతూ ఉంటాయి. అలా ఈ సారి దసరా బరిలో కాస్త గట్టి సినిమాలే కనిపిస్తున్నాయి.

బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ‘భగవంత్ కేసరి‘ ఈ నెల 19వ తేదీన థియేటర్లకు రానుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమా ఇది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తెరపై పండుగ వాతావరణం కనిపించే అవకాశాలు ఎక్కువే. ఇక తమన్ సంగీతాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అందువలన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక అదే రోజున విజయ్ ‘లియో’ సినిమా రంగంలోకి దిగిపోతోంది. విజయ్ కి ఇక్కడ ఉన్న క్రేజ్ .. దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి ఉన్న ఇమేజ్ .. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. ఈ కాంబినేషన్ కీ .. కంటెంట్ కి థియేటర్స్ కి రప్పించే సత్తా పుష్కలంగా ఉంది. ఇక ఆ తరువాత రోజున రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఆడియన్స్ ముందుకు రానుంది. భారీతనం విషయంలో రాజీపడకుండా బరిలోకి దిగిన సినిమా ఇది. ఈ మూడు సినిమాలు కూడా ఈ దసరాకి వసూళ్ల పరంగా థియేటర్స్ ను దడదడలాదిస్తాయనే ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. చూడాలి మరి ఎవరు ఎక్కువ వసూళ్లను రాబడతారో!

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ముందు ‘భగవంత్ కేసరి’ నిలబడదా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్