Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు తెరపై తగ్గిన గ్లామర్ సందడి!

తెలుగు తెరపై తగ్గిన గ్లామర్ సందడి!

తెలుగు సినిమా కథానాయికలకి సంబంధించి కొంత వెనక్కి వెళితే, సావిత్రి, జమున, కృష్ణకుమారి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత తరంలో వాణిశ్రీ, శారద, కాంచన వంటివారు తమ జోరు చూపించారు. ఇక శ్రీదేవి, జయసుధ, జయప్రద… ఆ తరువాత వచ్చిన విజయశాంతి, రాధ, రాధిక వంటివారు సుదీర్ఘ కాలం పాటు తన హవాను కొనసాగించారు. హీరోయిన్స్ అంతకాలం పాటు నిలదొక్కుకోవడం ఇకపై కష్టమేనని అంతా అనుకున్నారు.

కానీ ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన శ్రియ, కాజల్, తమన్నా, సమంత కూడా చాలా కాలం పాటు తమ కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తించారు. ఆ తరువాత నుంచి మాత్రం తెలుగు తెరపై కొత్త కథానాయికల సందడి తగ్గినట్టుగానే కనిపిస్తోంది. కృతి శెట్టి, శ్రీలీల సరైన సమయంలో ఇక్కడ అడుగుపెట్టారు. గ్లామర్ తోను .. డాన్సులతోను యూత్ మనసులు కొల్లగొట్టారు. అయితే వరుస పరాజయాల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు.

దాంతో తెలుగు తెరపై ఇప్పుడు గ్లామర్ లోటు తెలుస్తోంది. అసలు కథానాయికలే లేని కంటెంట్ పెరుగుతూ ఉండటం కూడా ఇందుకు ఒక కారణంగానే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే యూత్ ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఈ బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. చూడాలి మరి .. పోటీ పెద్దగా లేని ఈ సమయంలో ఈ సుందరి ఇక్కడ నిలదొక్కుకుంటుందేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్