Saturday, January 18, 2025
Homeసినిమాటాలీవుడ్ కి మరో బాలీవుడ్ బ్యూటీ!

టాలీవుడ్ కి మరో బాలీవుడ్ బ్యూటీ!

మొదటి నుంచి టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల జోరు ఎక్కువే. తెరపై అందాల సందడి చేయడానికి వాళ్లకి పెద్దగా మొహమాటాలు ఉండవు కనుక, వాళ్లనే రంగంలోకి దింపేవారు. ఆ తరువాత కాలంలో తెలుగు స్క్రీన్ పై తమిళ .. మలయాళ భామల హవా కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా మలయాళ మందారాల సొగసులు డిమాండ్ పెరుగుతూ వెళ్లింది. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చే భామల సంఖ్య భారీగానే తగ్గింది. కానీ ఇటీవల కాలంలో మళ్లీ ఊపందుకుంది.

తెలుగు సినిమా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లి ప్రపంచపటాన్ని ఆక్రమించింది. ఇప్పుడు తెలుగు సినిమా చేస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతున్న తెలుగులు సినిమాలు చేయడానికి అక్కడి టాప్ హీరోయిన్స్ సైతం ఎగబడుతున్నారు. అలా అలియా .. కియారా .. అనన్య పాండే వంటివారు ఈ జాబితాలో కనిపిస్తారు. త్వరలో దీపిక కూడా తెలుగు తెరపై సందడి చేయనుంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే బాలీవుడ్ నుంచి మరో బ్యూటీ టాలీవుడ్ కి వచ్చింది .. ఆ అమ్మాయి పేరే అవంతిక. ఒకప్పుడు మైనే ప్యార్ కియా’ సినిమాతో దేశంలోని కుర్రాళ్లకు కునుకులేకుండా చేసిన భాగ్యశ్రీ కూతురే ఈ అమ్మాయి. బెల్లంకొండ గణేశ్ హీరోగా చేసిన ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమాతో అవంతిక తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. చూస్తుంటే ఈ నాజూకు భామ అభిమానుల సంఖ్యను గట్టిగానే నమోదు చేసేట్టుగా కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి అడుగుపెడతానని శ్రీదేవి కూతురు జాన్వీ కొన్నేళ్ల నుంచి ఊరిస్తూ ఉంటే, ఎలాంటి హడావిడి చేయకుండా భాగ్యశ్రీ కూతురు ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్