Saturday, January 18, 2025
Homeసినిమాఅందంగా మెరిసిన 'భాగ్యశ్రీ బోర్సే'

అందంగా మెరిసిన ‘భాగ్యశ్రీ బోర్సే’

రవితేజ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. పీపుల్ మీడియా – టి సిరీస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇచ్చింది. కృతి శెట్టి – శ్రీలీల – ఆషికా రంగనాథ్ తరువాత ఇండస్ట్రీకి పరిచయమైన సుందరి భాగ్యశ్రీ. పోస్టర్స్ తోనే యూత్ హృదయాలను ఈ బ్యూటీ కొల్లగొట్టేసింది. థియేటర్స్ దిశగా ఆడియన్స్ ను నడిపించింది.

1980లో నడిచే ఈ కథలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపిస్తాడు. నిజాయితీ కారణంగానే సస్పెన్షన్ కి గురైన అతను, తన సొంత ఊరుకి తిరిగెళ్లిపోయి, ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటూ ఉంటాడు. పాటల కేసెట్లు కొనడానికి వచ్చిన హీరోయిన్ ను లైన్లో పెడతాడు. అలా వాళ్ల ప్రేమ మొదలవుతుంది. కాకపోతే సస్పెన్షన్ వేటుపడినంత మాత్రాన హీరో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకోవడమే కాస్త ఇబ్బందిని కలిగిస్తుందంతే. తెరపై వచ్చేవి హిట్ సాంగ్స్ కనుక ప్రేక్షకులు ఆ సంగతి మరిచిపోతారు.

ఆ విషయం అలా ఉంచితే తెరపై కథ నడుస్తూ ఉంటుంది .. సన్నివేశాలు పరిగెడుతూ ఉంటాయి. కాకపోతే ఆ తెరపైకి భాగ్యశ్రీ వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. ఆకర్షణీయమైన రూపంతో భాగ్యశ్రీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పచ్చు. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరి, డాన్సుల పరంగా మరో రెండు మూడు సినిమాలతో దార్లో పడిపోతుంది. ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై అందంగా మెరిసిన కథానాయికగా భాగ్యశ్రీకి కితాబు ఇవ్వొచ్చు. ఈ సినిమాతో ఈ అందాల భామ హవా మొదలైందనే చెప్పుకోవాలేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్