Tuesday, March 10, 2026
HomeTrending Newsతెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తెలంగాణలో మొత్తం 13 రోజులకే రాహుల్ పాదయాత్ర కుదించారు. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్న రాహుల్ గాంధీ 13 రోజుల పాటు రోజు వారీగా యాత్ర సాగే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానున్న భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం పలికేందుకు హస్తం నేతలు ప్రణాలికలు సిద్దం చేశారు.

1వ రోజు..
మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో భారత్ జోడో యాత్ర..
రాహుల్ పాదయాత్ర లో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు.

2వ రోజు..
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు..

3వ రోజు..
మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

4వ రోజు..
జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.

5వ రోజు..
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
మహేశ్వరం అసెంబ్లీ తోపాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

6వ రోజు..
శంషా బాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు.

7వరోజు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం రాహుల్ పాదయాత్ర..
ఈ పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలు పాల్గొంటారు.

8వ రోజు..
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది.
ఈ యాత్రలో మల్కాజ్ గిరి, మహబూబా బాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

9వ రోజు..
సంగారెడ్డి లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
మెదక్, వరంగల్ లోక్ సభ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

10వ రోజు..
జోగి పేట లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

11వ రోజు..
శంకరం పేట ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర..
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

12 వ రోజు..
జుక్కల్ ప్రాంతాల్లో సాగనున్న రాహుల్ యాత్ర.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు.

13వ రోజు..
జుక్కల్ లోనే సాగనున్న యాత్ర..
కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్ర వ్యాప్త ముఖ్య నేతలు పాల్గొంటారు.

13వ రోజు సాయంత్రం తో తెలంగాణలో ముగియనున్న రాహుల్ పాదయాత్ర.  మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందం ఈ రోజు హైదరాబాద్ కు విచ్చేస్తుంది. ఉదయం మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నివాసంలో టీపీసీసీ నాయకులు మహారాష్ట్ర నాయకులు సమావేశం అవుతారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు.. తర్వాత భారత్ జోడో రూట్ పరిశీలనకు వెళ్తారు.

Also Read : భారత్ జోడో యాత్రకు సోనియా, ప్రియాంక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular