Saturday, March 14, 2026
Homeసినిమాకడప జిల్లాలో కమల్ హాసన్

కడప జిల్లాలో కమల్ హాసన్

సుప్రసిద్ధ నటుడు కమల్ హాసన్  కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలోని గండికోటలో సందడి చేశారు.  డైరెక్టర్ శంకర్ రూపొందిస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్   గండికోటలో  జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం కమల్ తో పాటు సినిమా బృందం గండికోట వచ్చింది.

షూటింగ్ సంగతి తెలుసుకుకొని  సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, అభిమానులు హీరో కమల్ హాసన్ ను చూసేందుకు అక్కడకు వచ్చారు. కమల్ అందరికీ అభివాదం చేశారు.  6 రోజుల పాటు షూటింగ్ గండికోటలో కొనసాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular