Friday, March 13, 2026
Homeసినిమా‘ఉస్తాద్’ గా మారిన ‘భవదీయుడు’: త్వరలో షూటింగ్ కు రెడీ?

‘ఉస్తాద్’ గా మారిన ‘భవదీయుడు’: త్వరలో షూటింగ్ కు రెడీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రకటించిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ.. సెట్స్ పైకి మాత్రం రావడం లేదు. డైరెక్టర్ హరీష్‌ శంకర్ మాత్రం పవర్ స్టార్ డేట్స్ ఇస్తారనే ఆశతో అలా ఎదురు చూస్తునే ఉన్నాడు. కొన్ని నెలల కిందట మైత్రీ మూవీ మేకర్స్ వారి అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ హాజరయ్యారు. ఆ వేడుకలో త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా స్టార్ట్ అవుతుందని పవన్ చెప్పారు కానీ.. జరగలేదు.  తాజాగా ఈ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది.

అయితే ఈ సినిమా పేరును భవదీయుడు భగత్ సింగ్ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మార్చారు. టైటిల్ మార్చిన సరికొత్త పోస్టర్ ను నేడు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగ్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ ని ఈ సినిమాకు సబ్  టైటిల్ గా పెట్టారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ‘This time this is not just entertainment’  అనే కాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.

పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరోవైపు పొలిటికల్ గా కూడా బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే ఉస్తాద్ ను పూర్తి చేస్తారా లేదా ఎన్నికల తర్వాతే విడుదల ఉంటుందా అనేదానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular