Saturday, January 18, 2025
Homeసినిమాప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డంతో పాటు ఓ పాట రాయ‌డం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ భీమ్లా నాయ‌క్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

శుక్రవారం భీమ్లా నాయ‌క్ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా సెన్సార్ కూడా పూర్తి కావ‌డంతో భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ప‌క్కా అయ్యింది. ఇక‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు భారీగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ ఫంక్ష‌న్ ఎప్పుడు.? ఎక్క‌డ‌..? అనేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్