Tuesday, March 17, 2026
Homeసినిమాసెన్సార్ కి రెడీ అయిన భీమ్లా నాయ‌క్

సెన్సార్ కి రెడీ అయిన భీమ్లా నాయ‌క్

Bheemla Nayak to Censor: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25 లేదా ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే.. ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు భీమ్లా నాయ‌క్‌ను ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అందుకు త‌గ్గ‌ట్టే వారు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం.. భీమ్లా నాయక్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇంకా ఈ సినిమా సెన్సార్ డేట్ ఫిక్స్ కాలేదు. సెన్సార్ పూర్తి కాగానే.. భీమ్లా నాయక్ రిలీజ్ పై మరింత క్లారిటీ రానుంది. పిడివి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు ఓ పాట కూడా రాయ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular