Sunday, January 19, 2025
Homeసినిమా25నే వ‌చ్చేస్తున్న భీమ్లా నాయ‌క్

25నే వ‌చ్చేస్తున్న భీమ్లా నాయ‌క్

Bheemla on 25th: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శక‌త్వం వ‌హించారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. దీంతో భీమ్లా నాయ‌క్ పై అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన భీమ్లా నాయ‌క్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

సంక్రాంతికి రావాలి అనుకుంటే.. ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేయాల్సివ‌చ్చింది. ఆత‌ర్వాత క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు కేసులు త‌గ్గడంతో భారీ చిత్రాలు థియేట‌ర్లోకి వ‌చ్చేందుకు క్యూక‌డుతున్నాయి. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 25న కానీ.. ఏప్రిల్ 1 కానీ విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత నాగ‌వంశీ ప్రక‌టించారు. అయితే.. ఫిబ్రవ‌రి 25న మెగా హీరో వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమా రిలీజ్ అని నిన్న ఉద‌యం అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.

అబ్బాయ్ వ‌రుణ్ తేజ్ గ‌ని ఫిబ్రవ‌రి 25న వ‌స్తుంది క‌నుక‌… బాబాయ్ భీమ్లా నాయ‌క్ ఫిబ్రవ‌రి 25న రాదని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. అయితే..అంద‌రికీ షాక్ ఇస్తూ.. భీమ్లా నాయ‌క్ ఫిబ్రవ‌రి 25నే రిలీజ్ అని నిన్న రాత్రి అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. దీంతో గ‌ని మ‌రోసారి వాయిదా ప‌డ‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే.. భీమ్లా నాయ‌క్ 25న రావ‌డం అనేది పండ‌గ లాంటి వార్త అని చెప్పచ్చు.

Also Read : వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్