Sunday, January 19, 2025
Homeసినిమాఅమెరికాలో 'భీమ్లా నాయ‌క్‌’ సందడి

అమెరికాలో ‘భీమ్లా నాయ‌క్‌’ సందడి

Power in US: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటిల కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భీమ్లా నాయ‌క్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా పిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఆత్మ గౌర‌వానికి, అహంకారానికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే భీమ్లా నాయక్ సినిమా అని సినిమా ప్రారంభంలో చెప్పారు. భారీ అంచనాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉండ‌టంతో సినిమాకు హిట్ టాక్ వ‌చ్చింది.

ఇక యు.ఎస్‌లో ప్రీమియ‌ర్స్ విష‌యానికి వ‌స్తే.. ప్రీమియ‌ర్స్‌కు $875k (రూ. 6.56 కోట్లు) వ‌చ్చాయి. అమెరికాలో ప‌లు న‌గ‌రాల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక శుక్ర‌వారం సాయంత్రానికి $378k వ‌సూళ్ల‌ను భీమ్లా నాయ‌క్ సాధించింది. అంటే మొత్తంగా చూస్తే శుక్ర‌వారం సాయంత్రానికి $ 1.25 మిలియ‌న్స్ వ‌చ్చాయి. అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్స్ ప్ర‌కారం రూ.9.37 కోట్లు. అలాగే ఆస్ట్రేలియాలో A$153,593 (రూ.83.20 ల‌క్ష‌లు), యు.కెలో 87.283 పౌండ్స్ (రూ.87.80 ల‌క్ష‌లు) వ‌చ్చాయి. గ‌త రెండేళ్ల‌లో యు.ఎస్ లో ప్రీమియ‌ర్, ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ క‌లిపి 1 మిలియ‌న్ రాలేదు. ఇప్పుడు భీమ్లా నాయ‌క్ చిత్రానికి ప్రీయిమ‌ర్ అండ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ క‌లిపి 1 మిలియ‌న్ క్రాస్ చేయ‌డం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్