Respect for Gowhatm Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఈ భారీ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈరోజు సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో భారీగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు ఉదయం మరణించారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాద సమయంలో ఆడియో ఫంక్షన్ చేయడం కరెక్ట్ కాదని భావించిన భీమ్లా నాయక్ నిర్మాణ సంస్థ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో ప్రకటిస్తామని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలియచేసింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వలన నెలకొన్న విషాద సమయంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. అందుకనే నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుందని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలియచేశారు.
Also Read : మంత్రి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం – కెసిఆర్