Sunday, January 19, 2025
Homeసినిమాఫిబ్రవరి 25కు మారిన భీమ్లా నాయక్

ఫిబ్రవరి 25కు మారిన భీమ్లా నాయక్

Bheemla Nayak  in February:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణా కాంబినేషన్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న భీమ్లా నాయక్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్  నేడు మీడియా సమావేశంలో వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ జనవరి 13న విడుదల చేయాలని నిర్ణయించారు. భీమ్లా నాయక్ జనవరి 12 న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

అయితే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాల నిర్మాణం రెండేళ్ళ నుంచీ సాగుతోందని, ఒకేసారి ఇన్ని పెద్ద సినిమాలు విడుదలయితే కొంత ఇబ్బందిగా ఉంటుందని, ఇదే విషయాన్ని తాను, దానయ్య, వంశీ ముగ్గురం పవన్ కళ్యాణ్, నిర్మాత చినబాబు దృష్టికి తీసుకెళ్ళామని, వారు  తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి  సినిమా విడుదల వాయిదా వేసేందుకు అంగీకరించారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున దిల్ రాజు వెల్లడించారు. భీమ్లా నాయక్ శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదలవుతుందని రాజు తెలిపారు.  తాను నిర్మిస్తున్న ఎఫ్ 3 ని ఫిబ్రవరి 25న విడుదల చేద్దామని అనుకున్నామని, అయితే అదే రోజున భీమ్లా నాయక్ వస్తున్నందున తమ చిత్రాన్ని ఏప్రిల్ 29కి వాయిదా వేసుకున్నామనన్నారు.

ఇంతకుముందే మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట ఏప్రిల్ 1 నాటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి4న ఆచార్య విడుదలవుతుండడం గమనార్హం.

Also Read : భీమ్లా నాయ‌క్ నుంచి స్పెష‌ల్ టీజ‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్