Wednesday, March 18, 2026
Homeసినిమాయు.ఎస్ లో భీమ్లానాయ‌క్ సెన్సేష‌న్

యు.ఎస్ లో భీమ్లానాయ‌క్ సెన్సేష‌న్

Bheemla mania: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ద‌గ్గుబాటి రానా కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ భారీ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ వంశీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ క్రేజీ మూవీని శివరాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వరి 25న విడుద‌ల చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాట‌ల‌కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం.. త్రివిక్ర‌మ్  స్క్రీన్ ప్లే,  సంభాష‌ణ‌లు అందించ‌డం.. ఓ పాట కూడా రాయ‌డంతో భీమ్లా నాయ‌క్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవ‌ర్ సీస్ లో సైతం భారీగా రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో ఏకంగా 400 కి పైగా థియేటర్లలో భారీగా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ విష‌యాన్ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ తెలియ‌చేస్తూ.. ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం కూడా జ‌రిగింది. మొత్తానికి అయితే.. భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. మ‌రి.. భీమ్లా నాయ‌క్ తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే ఓవ‌ర్ సీస్ లోను ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : ‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular