Sunday, February 23, 2025
Homeసినిమా‘భీమ్లానాయక్’ వీడియో ప్రొమో వచ్చేస్తోంది

‘భీమ్లానాయక్’ వీడియో ప్రొమో వచ్చేస్తోంది

Bheemla Naik Title Song Video Will Be Released Today Evening :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పవర్ హౌస్ రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు – స్ర్కీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమానుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ సాంగ్స్ అండ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భీమ్లానాయక్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా ‘భీమ్లా నాయక్’ నుంచి ‘లాలా.. భీమ్లా’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేయడానికి ముహుర్తం పిక్స్ చేశారు. ఈరోజు రాత్రి 7.02 నిమిషాలకు ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. భీమ్లా నాయక్ నుంచి వపర్ స్టార్ న్యూ స్టిల్ రిలీజ్ చేశారు. ఇందులో నుదిట బొట్టు పెట్టుకుని.. లుంగీ పంచుకుట్టుకుని.. నేల మీద కూర్చొన్నారు భీమ్లా నాయక్. ఈ స్టిల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ భారీ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే.. ఈ పోస్టర్ లో జనవరి 12న బీమ్లా నాయక్ విడుదల అని మరోసారి ప్రకటించారు. సో.. భీమ్లా నాయక్ సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అనుకోవచ్చు.

Must Read : 20న ‘భీమ్లా నాయక్’ నుంచి రానా ఫస్ట్ లుక్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్