Same Date: మెగా క్యాంప్ హీరోలు మామూలు స్పీడులో లేరు. ఒక వైపు అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో ‘భీమ్లా నాయక్’గా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడానికి సిద్ధమైపోతున్నారు. నిజానికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా RRR, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు దారి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ అండ్ టీమ్. దీంతో ‘భీమ్లా నాయక్’ను శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
అయితే తాజాగా మరోసారి ‘భీమ్లా నాయక్’ అనుకున్న తేదీకి రాబోదంటూ వార్తలు వినిపించసాగాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ వార్తల్లో నిజం లేదు. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాయిదా వార్తలను తోసిపుచ్చేస్తున్నారట. వారు ఓవర్సీస్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చేయబోతున్నారట. ‘భీమ్లా నాయక్’ ప్రకటించినట్లే శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదలవుతుంది.
అలాగే మరో వైపు కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను తొలగించే దిశగా ఆలోచనలు చేస్తుందని కూడా సమాచారం. అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత మరో స్టార్ హీరో మూవీ ఏదీ థియేటర్స్ కు రాలేదు. సినీ ప్రేమికులు, పవర్ స్టార్, మెగా ఫ్యాన్స్ ఆతృతగా ‘భీమ్లా నాయక్’ కోసం విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఇది వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నింటికీ అద్భుతమైన స్పందన చ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు ధీటుగా పవర్ స్టార్ తన పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.