Friday, March 13, 2026
HomeసినిమాChiranjeevi: చిరు ఆలోచనను మార్చేసిన భోళాశంకర్.?

Chiranjeevi: చిరు ఆలోచనను మార్చేసిన భోళాశంకర్.?

చిరంజీవి నటించిన మూవీ ‘భోళాశంకర్‘. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇది రీమేక్ మూవీ. ఇప్పుడు ఓటీటీ రావడం వలన రీమేక్ మూవీల కథలు ముందే తెలిసిపోవడం వలన జనాలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అయితే.. ఇదే విషయం గురించి చిరంజీవి దగ్గర జర్నలిస్టులు ప్రస్తావిస్తే.. వేరే భాషలో మంచి కథతో సినిమా వస్తే.. ఈ కథను రీమేక్ చేస్తే తప్పేంలేదని… ఖచ్చితంగా జనాలు చూస్తారని చెప్పేవారు. సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుందని.. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మారు.

అయితే.. చిరంజీవి నమ్మకం నిజం కాలేదు. ఊహించని విధంగా భోళాశంకర్ డిజాస్టర్ అయ్యింది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీనే రీమేక్ తో ఇచ్చారు. అదే ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా సక్సెస్ అయ్యింది. అలాగే లూషీపర్ రీమేక్ ను గాడ్ ఫాదర్ గా చేశారు. ఇది ఫరవాలేదు అనిపించింది. అందుచేత భోళాశంకర్ మూవీ కూడా పాస్ అవుతుంది అనేది చిరంజీవి థీమా. అయితే… ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వాస్తవంలోకి వచ్చేశారు. ఇక నుంచి రీమేక్ సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారట. అందుకనే కళ్యాణ్ కృష్ణతో చేయాలి అనుకున్న బ్రో డాడీ రీమేక్ ను పక్కనపెట్టేశారట.

తాజా వార్త ఏంటంటే…. ఇటీవల ఒక అగ్రనిర్మాత చిరంజీవిని కలిళారట. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ హక్కులు తన దగ్గర ఉన్నాయని.. తెలుగు నేటివిటీకి తగ్టట్టుగా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని చెప్పారట. అంతే కాకుండా ఓ కొత్త దర్శకుడుతో కథను చెప్పించే ప్రయత్నం చేశారట. అయితే.. చిరు పదే పదే పొరపాట్లు చేసేందుకు సిద్దంగా లేనని చెప్పారట. అంతే కాకుండా.. ఇక నుంచి రీమేక్ లే చేయాలి అనుకోవడం లేదని.. ఈ సినిమా చేయనని సూటిగా చెప్పేసారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మొత్తానికి భోళాశంకర్ చిరు ఆలోచనను మార్చేసింది అన్నమాట.

Also Read: భోళాశంకర్ విషయంలో జరిగింది అదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular