Tuesday, March 17, 2026
Homeసినిమాపోస్ట్ ప్రొడక్షన్ దశలో 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ'

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’

పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమే ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తున్న యంగ్ హీరో శివ కందుకూరి ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపింబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఓం నమశ్శివాయ అనే అద్భుతమనైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో స్టార్ట్ అయినా ఈ మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక కుర్చీలో ఒక స్త్రీని కట్టివేయడం, ఆమెకు తల లేకుండా కేవలం మొండెం మాత్రమే చూపించడం ఈ సినిమా పై క్యూరియాసిటీను పెంచుతుంది. ఈ చిత్రం షూటింగు పూర్తిచేసుకుని, ప్రస్తుతం ఎడిటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular