Tuesday, March 17, 2026
Homeసినిమాఓటీటీకి వచ్చేస్తున్న 'బిచ్చగాడు 2'

ఓటీటీకి వచ్చేస్తున్న ‘బిచ్చగాడు 2’

చాలామంది హీరోలు తమకి వరుస ఫ్లాపులు పడుతున్నప్పుడు, గతంలో తమకి హిట్ ఇచ్చిన సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధపడుతుంటారు. అలా హిట్ సినిమా సీక్వెల్ తో మళ్లీ గాడిలో పడిపోయిన హీరోలు చాలామందే కనిపిస్తూ ఉంటారు. అలాంటి హీరోల జాబితాలో విజయ్ ఆంటోనీని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా అనువాద సినిమాలను అందులో తెలిసిన స్టార్స్ ఉంటేనే చూస్తుంటారు. తెలుగులో ఎవరికీ తెలియకపోయినా, ‘బిచ్చగాడు’ సినిమాతో సంచలనం సృష్టించిన హీరోగా విజయ్ ఆంటోని కనిపిస్తాడు.

‘బిచ్చగాడు’ తరువాత విజయ్ ఆంటోని ఎన్ని సినిమాలు చేసినా, ఆ స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు .. వసూళ్లను రాబట్టుకోలేదు. బాగా ఆలోచించే ఆయన ‘బిచ్చగాడు 2’కి శ్రీకారం చుట్టాడు. అయితే కేవలం ఆయన ఆ టైటిల్ ను పట్టుకునే, ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేయలేదు. బలమైన కథాకథనాలు .. అందుకు తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎమోషన్స్ ఉండేలా చూసుకుని రంగంలోకి దిగాడు. చాలా తక్కువ రోజులలోనే భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాకి, ఓటీటీలోను మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సాధించిన విజయంతో, ఇప్పుడు విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 3’కి సంబంధించిన కథను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular