Tuesday, February 25, 2025
HomeTrending NewsRajeev Swagruha: పోటా పోటీగా అమ్ముడుపోయిన బండ్లగూడ ఫ్లాట్స్

Rajeev Swagruha: పోటా పోటీగా అమ్ముడుపోయిన బండ్లగూడ ఫ్లాట్స్

హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ(సహభావన టౌన్ షిప్) ఫ్లాట్స్ ఓపెన్ ఆక్షన్ లో బిడ్డర్లు పోటీపడి మరి కొనుగోలు చేశారు. సోమవారం జరిగిన ఓపెన్ఆక్షన్ లో ఏడు (7) త్రిబుల్ బెడ్ రూమ్ (డీలక్స్) ఫ్లాట్లకు 86 మంది బిడ్డర్లు, ఆరు(6) త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు 108 మంది బిడ్డర్లు పాల్గొనగా, 21 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు 167 మంది బిడ్డర్లు ఓపెన్ యాక్షన్లు పాల్గొని ఎక్కువ రేట్లను కోట్ చేసి మొత్తం 34 ఫ్లాట్లను కొనుగోలు చేశారు.

సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 226 అమ్మకాల కోసం అధికారులు మంగళవారం(27వ తేదీ) నుంచి శుక్రవారం (30వ తేదీ) వరకు వరుసగా నాలుగు రోజులపాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బండ్లగూడ సైట్ ఆఫీస్ వద్ద ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. గతంలో లాటరీ ప్రాతిపదికన బండ్లగూడ ఫ్లాట్ల అమ్మకాలకు వచ్చిన రేటు కంటే ఈసారి ఎక్కువ రేటు ఓపెన్ ఆక్షన్ లో బిడ్డర్లు కోట్ చేసి తీసుకోవడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్