Wednesday, March 11, 2026
HomeTrending Newsగ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో బిగ్ బీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో బిగ్ బీ

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు హాజరైన ఆయన్ను ఎంపీ సంతోష్ కలిశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ సిటీలో ఓ మొక్కను నాటారు అమితాబ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి అమితాబ్‌కు సంతోష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌తో పాటు సినీ నటుడు నాగార్జున కూడా ఉన్నారు.

భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించిన బిగ్ బి.  రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular