Saturday, January 18, 2025
Homeసినిమాగీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో వ‌శిష్ట్ కి బంప‌ర్ ఆఫ‌ర్

గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో వ‌శిష్ట్ కి బంప‌ర్ ఆఫ‌ర్

Geetha Arts: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ బింబిసార‌. నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ డైరెక్ట్ చేసిన ‘బింబిసార’ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే ‘బింబిసార’ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎంత‌గా ఆద‌రిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా బింబిసార డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ పేరే వినిపిస్తోంది.

తొలి ప్ర‌య‌త్నంలోనే ఇంత భారీ చిత్రం చేయ‌డం.. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంతో డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ కి వ‌రుస‌గా ఆఫ‌ర్స్ క్యూక‌డుతున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. వ‌శిష్ట్ కి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఏంటా బంప‌ర్ ఆఫ‌ర్ అంటే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్నాడ‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ క్రేజీ కాంబినేష‌న్ లో మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించ‌నుంద‌ని స‌మాచారం.

బాల‌య్య‌తో అల్లు అర‌వింద్ ‘ఆహా’ కోసం అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో చేస్తున్న టైమ్ లోనే ‘గీతా ఆర్ట్స్’ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయాల‌ని అడిగార‌ట‌. బాల‌య్య వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. వ‌శిష్ట్ టాలెంట్ కి ఫిదా అయిన అల్లు అర‌వింద్ బాల‌య్య మూవీ కోసం వ‌శిష్ట్ ను రంగంలోకి దింపుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే.. వ‌శిష్ట్ కి ఇది బంప‌ర్ ఆఫ‌రే.

Also Read : కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు  మెగాస్టార్ చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్