Saturday, January 18, 2025
Homeసినిమాపి.వి.నరసింహరావు బయోపిక్

పి.వి.నరసింహరావు బయోపిక్

బహుభాషా కోవిదుడు-అసాధారణ ప్రజ్ఞాదురీణుడు- భారత మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పి.వి.నరసింహరావు బయోపిక్ ను ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ పతాకంపై రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో “శ్రీశైలం” చిత్రాన్ని నిర్మించారు. పలు సంచలన, సూపర్ హిట్ చిత్రాల రూపకర్త ధవళ సత్యం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లో… జాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి.నరసింహరావు పాత్రను పోషించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని… ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్