Sunday, January 19, 2025
Homeసినిమా‘బంగ‌ర్రాజు’ బర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘బంగ‌ర్రాజు’ బర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

కింగ్‌ నాగార్జున, యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్యల కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న క్రేజీ మ‌ల్టీస్టారర్ ‘బంగ‌ర్రాజు’. ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సినిమాకి సీక్వెల్‌.  ఈ చిత్రానికి క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. నేడు ఆగస్ట్ 29 నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘బంగార్రాజు’ నుండి  బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌ చేశారు.  ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ మ్యాజిక్‌ను పునరావృతం చేసేలా అదే ఫాంట్ డిజైన్ ఉపయోగించారు.

‘బంగార్రాజు.. ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. బ్లాక్ రే-బ్యాన్ గ్లాసెస్ మ‌రియు తెల్లటి చొక్కా, పంచె కట్టుతో పోస్టర్‌లో అచ్చ తెలుగు దసరాబుల్లోడుగా కనిపిస్తున్నారు కింగ్ నాగార్జున‌. పంచె కట్టు విషయంలో నాగార్జునకు ఎవ‌రు సాటిరారు. ఈ పోస్ట‌ర్‌లో స్వర్గం నుండి భూమికి వస్తున్న మన్మధుడులా కనిపిస్తున్నారు నాగార్జున‌. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  ద‌ర్శ‌కుడు క‌ళ్యాన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయ‌నా మూవీలో నాగార్జున ప‌క్క‌న గ్రేస్‌ఫుల్‌గా క‌నిపించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు బంగార్రాజులోనూ న‌టిస్తున్నారు. కుర్ర‌కారు మ‌న‌సు దోచుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టిని నాగచైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తుంది.

అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు జీ స్టూడియోస్ స‌హ నిర్మాతగా వ్యవహరిస్తోంది.  అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. స‌త్యానంద్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహ‌కుడిగా యువ‌రాజ్ ప‌ని చేస్తున్నారు. ప్రీక్వెల్‌లో నాగార్జున ఒక్కడే అలరించగా, సీక్వెల్‌లో నాగార్జున, నాగ చైతన్య క‌లిసి రెట్టింపు వినోదాన్ని అందించబోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్