నీటి ప్రాజెక్టుల విషయంలో ‘వన్ డ్రాప్ – మోర్ క్రాప్’ అన్నది భారతీయ జనతా పార్టీ విధానమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా తెలంగాణకు చెందిన నేతలే ఉంటూ వచ్చారని, నీటి విషయంలో తెలంగాణా నేతలకు పరిజ్ఞానం, అవగాహన ఎక్కువగా ఉంటుందని, ఎవరు అధికారంలో ఉన్న సరే వారి నీటి హక్కుల విషయంలో ఐక్యంగా ఉంటారని వివరించారు.
‘ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు వనరులు సవాళ్లు’ అనే అంశంపై విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీర్రాజు తో పాటు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి , సాగునీటి శాఖ మాజీ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలోనే నీరు, విద్యుత్, ఆర్ధిక వనరుల అంశాల్లో తెలంగాణా నేతలు, మేధావులు ఓ స్పష్టమైన అవగాహన, ఆలోచన తో ఉండేవారని, కానీ మన నేతలు మాత్రం కేవలం రాష్ట్రం కలిసి ఉండాలనే పోరాడారు ఉన్నారు తప్ప విడిపోతే రాష్ట్ర అభివృద్ధికి ఏమి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచించలేదని విశ్లేషించారు. రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలకు అన్ని అంశాలపై సమగ్ర అవహాగన ఉండాలని, అప్పుడే వారు తమ ప్రాంత సమస్యలపై బలంగా తమ వాదన వినిపించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కెసియార్ దార్శనికత అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
నీటి విషయంలో చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ఇటీవలి కాలంలో కెసియార్ కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు నీటి విషయమై బిజెపి ఏపీ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆలోచన వచ్చిందన్నారు సోము.