Sunday, January 19, 2025
HomeTrending Newsబిజెపి కోర్ కమిటీ ఏర్పాటు

బిజెపి కోర్ కమిటీ ఏర్పాటు

BJP Core Committee:
భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కోర్ కమిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 16 మందితో ఏర్పాటు చేశారు. నెలలో కనీస ఒక్కసారైనా ఈ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.

బిజెపి ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దగ్గుబాటి పురంధేరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సిఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ జి, ఎమేల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు,  రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి సభ్యులుగా ఉన్నారు.

జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, కేంద్ర మంత్రి వి. మురళీధరన్, రాష్ట్ర సహా ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ ప్రత్యేక ఆహ్వానితులుగా కోర్ కమిటీలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్