Sunday, November 24, 2024
HomeTrending Newsపసుపు బదులు కాషాయ కండువా: సుబ్బారెడ్డి

పసుపు బదులు కాషాయ కండువా: సుబ్బారెడ్డి

బిజెపి అగ్రనాయకత్వం తెలుగుదేశం ఉచ్చులో పడిందని,  నిన్న విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వేదికపై ఉన్న నేతల్లో చాలా మంది టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారేనని టిటిడి ఛైర్మన్,  వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వారు పచ్చ కండువాలకు బదులు కాషాయం ధరించారని ఎద్దేవా చేశారు.  టిడిపి నాయకులకు వత్తాసు పలికే విధంగా అమిత్ షా ప్రసంగం ఉందన్నారు. విశాఖలో సుబ్బారెడ్డి  మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల గురించి కూడా నిన్నటి సభలో అమిత్ షా మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. వైజాగ్ వచ్చిన ఆయన ఈ ప్రాంతం గురించి ఒక్క మాట చెప్పక పోవడం దారుణమని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు హామీ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన హామీల విషయంలో బిజెపి ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే ఎన్నికలల్లో ప్రజలు మెజార్టీ సీట్లు ఇస్తారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత టిడిపి హయంలో జరిగిన అవినీతికి నాడు భాగస్లోవామ్యం పార్టీగా ఉన్న బిజెపి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైజాగ్ లో ఫార్మా రంగం అభివృద్ధికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్