Monday, September 23, 2024
HomeTrending Newsకెసిఆర్ పాలనలో మహిళలకు చితి మంటలు - బండి సంజయ్

కెసిఆర్ పాలనలో మహిళలకు చితి మంటలు – బండి సంజయ్

అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలే… బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నా కొడుకుల అంతు చూస్తాం. యూపీ తరహాలో బుల్ డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చివేస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎస్టీ సామాజికవర్గ మహిళను రాష్ట్రపతిగా చేయడంతోపాటు మహిళలకు ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తుంటే…. రాష్ట్రంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ మహిళలు, బాలికలను చితిపై పేర్చే దుస్థితి ఏర్పడిందంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, చింతల రామచంద్రారెడ్డి, జాతీయ కార్యదర్శి పద్మజా మీనన్, నళిని, ఆకుల విజయ, డాక్టర్ పద్మ, కరుణ గోపాల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..

• సీఎం కేసీఆర్ చేతగానితనంవల్ల ప్రీతి మరణిస్తే మహిళా మోర్చా దమ్ము చూపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. సైఫ్ అనే సైకో చేసిన హత్య, సీఎంఓ నుండి వచ్చిన ఫోన్ తో ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారు.

• మోదీ ప్రభుత్వం ఎస్టీ సామాజికవర్గ మహిళను రాష్ట్రపతిగా చేసి గౌరవిస్తే… రాష్ట్రంలో ఎస్టీ మహిళలు, బాలికలను చితిపై పేర్చే దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ గతంలో ఎవరైనా తప్పు చేస్తే గుడ్లు, పీకేస్తా అని చేసిన హెచ్చరికలు ఉత్తమాటలే… యూపీలో బుల్ డోజర్లు పడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నాకొడుకుల అంతు చూస్తాం. యూపీ తరహాలో బుల్ డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చివేస్తాం.

• రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతోంది. మహిళలను పట్టించుకునే పాపాన పోలేదు. జూబ్లిహిల్స్ సంఘటన నుండి నిన్నటి ప్రీతి హత్య వరకు అనేక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కేసీఆర్ స్పందించరు. హోంమంత్రి ఉన్నరా? లేరా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో మహిళలంటే కవిత మాత్రమేనా? నిధులు, దందాలన్నీ ఆమెకేనా? మహిళల గురించి పోరాడేది మహిళా మోర్చా మాత్రమే.

• రాష్ట్రంలో బీజేపీయే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. 1999లో చంద్రబాబు ప్రత్యామ్నాయం.. 2004లో కాంగ్రెస్, 2014లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కన్పించింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. మార్పు కోరుకుంటున్నారు. మహిళలు తలెత్తుకుని తిరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.

• బండి సంజయ్ అంటే కేసీఆర్ కొడుకుకు భయం పట్టుకుంది. కేసీఆర్ కొడుకు పేరును ప్రస్తావించొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నడు. కార్పొరేటర్ నైన నన్ను అధ్యక్షుడిని చేస్తే తప్పేంది? ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా, చాయ్ వాలాను ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. టీఆర్ఎస్ లో ఆ అవకాశం ఉంటుందా? మహిళ అంటే కేసీఆర్ బిడ్డే. లిక్కర్ దందాతో తెలంగాణ పరువు తీస్తోంది. కవితను అరెస్ట్ చేయాలని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో మహిళలను ఏకం చేసి జిల్లా మహిళా మోర్చా నాయకులు పోరాడుతున్నరు.

• డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు, జీతాలు, మ్యాచింగ్ గ్రాంట్లు అడుగుతుంటే పైసలు లేవని చెబుతున్న కేసీఆర్… ఆయన బిడ్డ లిక్కర్ దందాకు వందల కోట్లు ఎట్లా వచ్చాయి? మీ కుటుంబం అక్రమ దందాలకు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలి.

• ఉద్యోగులకు 3 నెలల వరకు జీతాలిచ్చే పరిస్థితి లేదు… ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు అర్ధమయ్యేలా చెప్పాలని కేసీఆర్ గతంలో బెదిరించారు. ఇది గమనించే ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నం. ఈరోజు ఉద్యోగులతోపాటు నిరుద్యోగులు, మహిళలు, రైతుల పక్షాన పోరాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నాం.

• టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా చేసినా సాధించేదేమీలేదు. ఇచ్చిన హామీలే అమలు చేయలేనోడు. మహిళా వర్శిటీని ఏర్పాటు చేస్తామని ఇంతవరకు అమలు చేయని మూర్ఖుడు.

• ట్విట్టర్ టిల్లుకు సిగ్గు లేదు… కేంద్రం ఏమిచ్చిందంటూ ప్రతిసారి సోయి లేకుండా మాట్లాడుతున్నడు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చర్చకు సిద్ధమని చెబితే పారిపోతున్నడు.

• బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా సమావేశాలు సహా ఏ మీటింగ్ లు పార్టీ కార్యాలయంలో పెట్టినా పోలీసుల బందోబస్తు పెడుతున్నారు.

• రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు, దాడులకు ప్రధాన కారణం మద్యం అమ్మకాలే. తాగడానికి నీళ్లు లేవు కానీ మద్యానికి ఢోకా లేకుండా చేస్తున్నారు. బెల్టు షాపులను నిషేధించాల్సిన అవసరం ఉంది.

• బీఆర్ఎస్ పార్టీ మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త తగిలించినట్లయింది. కేసీఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయింది. తెలంగాణను తాకట్టు పెట్టిన కేసీఆర్ రాక్షస పాలనపై మహిళా మోర్చా మరింతగా పోరాడాలి. అధికారంలోకి రావాలంటే ఈ పోరాటాలు ఏమాత్రం సరిపోవు… ఇంకా కష్టపడాలి.

• మహిళలుసహా కార్యకర్తలంతా కష్టపడటంవల్లే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్ అయ్యాయి. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కించపరుస్తున్న బైరి నరేష్ లాంటి వాళ్లకు తగిన బుద్ది చెబుతున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్… పార్టీ కోసం, దేశం, ధర్మం కోసం జైలుకు వెళ్లేందుకు వెనుకాడని వాళ్లకు నా అభినందనలు.. మహిళల పక్షాన పోరాడుతున్న మహిళా మోర్చా నేతలుండటం గ్రేట్.

• కష్టపడి పనిచేస్తూ గెలిచే అవకాశమున్న మహిళా నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే బాధ్యత నాది. ఈసారి ఎక్కువ మంది మహిళా మోర్చా నాయకులు ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నా. డబ్బుల గురించి ఆలోచించొద్దు.. ప్రజల తరపున కొట్లాడండి.. నేను సామన్య కార్యకర్తను. కార్పొరేటర్ గా ఉన్న నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. 9 ఏళ్లు పార్టీలో నాకు ఏ పదవి లేదు.. అయినా జనంలోనే ఉన్నా.. పార్టీ ఆఫీస్ లో కార్యకర్తగా ఉన్న కిషన్ రెడ్డి ఇయాళ కేంద్ర మంత్రి అయ్యారు. కష్టపడే వాళ్లకు బీజేపీలో తప్పకుండా గుర్తింపు వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్