Sunday, January 19, 2025
HomeTrending Newsబీజేపీ అంటే అమ్మకం...టీఆర్ఎస్ అంటే నమ్మకం

బీజేపీ అంటే అమ్మకం…టీఆర్ఎస్ అంటే నమ్మకం

కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా వచ్చినందుకు తెలంగాణ ప్రజలు హర్షించారని, సహాయ మంత్రిగా తెలంగాణకు ఏం చేయలేకపోయారు …ఇపుడైనా చేస్తారని ఆశిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర రావు, బల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే మోసపూరిత పార్టీ అని విమర్శించారు. టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మీట్ ది ప్రెస్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, బల్క సుమన్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అని, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల కన్నా ఒక్క పైసా ఎక్కువగా బీజేపీ ఏమైనా ఇచ్చిందా కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అంకెలు ,సంఖ్యలు చెప్పి కిషన్ రెడ్డి హుందా గా వ్యవహరించాలని హితవు పలికారు.

బండి సంజయ్ లా పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి కిషన్ రెడ్డి అన్న ఎర్రబెల్లి బండి సంజయ్ మాటలతోనే బీజేపీ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోరంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

టూరిజం లో తెలంగాణ వెనకబడి ఉంది …మంత్రి గా కిషన్ రెడ్డి ఏం చేస్తారో తెస్తారో చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారాని ఘాటుగా విమర్శించారు.

కిషన్ రెడ్డి యాత్ర ఒక విఫల యాత్ర అన్న ఎర్రబెల్లి కాజీ పేట కు కోచ్ ఫ్యాక్టరీ లేదని కేంద్రం సిగ్గు లేకుండా చెప్పింది, బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ లేదంటుంది, ములుగు లో ట్రైబల్ యూనివర్సిటీ కి మొండి చేయి చూపారు, ఇంకెందుకు ప్రజలు బీజేపీ కి మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి తన స్థాయి ని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని  ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ,బండి సంజయ్ స్థాయి కి కిషన్ రెడ్డి దిగజారారని, బీజేపీ అంటేనే అమ్మకం …టీ ఆర్ ఎస్ అంటే నమ్మకం అన్నారు. దేశం లో అన్నిటిని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని, తెలంగాణ BHEL లాంటి సంస్థలకు 25 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తే కేంద్రం అంబాని ,అదానీ లకు దేశాన్ని అమ్మేస్తోందని విమర్శించారు. మోడీ కి ప్రజల పొట్ట తిప్పలు పట్టవు …ఫోటో తిప్పలే కావాలని ఎద్దేవా చేశారు.

కిషన్ రెడ్డి తెలంగాణకు సూటిగా ఏం చేస్తారో చెప్పాలన్న సుమన్ హైదరాబాద్ కు itir ఎప్పుడు తెస్తావో కిషన్ రెడ్డి హైదరాబాబాద్ లో ఈ రోజు చెప్పాలని డిమాండ్ చేశారు. నేరస్థుల కు బీజేపీ అడ్డాగా మారిందని, రాజేందర్ లాంటి నేరస్థుడ్ని బీజేపీ లో చేర్చుకున్నారని ఆరోపించారు.

మోడీ మోసాలకు ,కెసిఆర్ విశ్వసనీయతకు హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ జరగబోతోందని, హుజురాబాద్ లో ఈటెల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్