Saturday, November 23, 2024
HomeTrending Newsనా హత్యకు కుట్ర జరుగుతోంది - ఈటెల రాజేందర్

నా హత్యకు కుట్ర జరుగుతోంది – ఈటెల రాజేందర్

తనపై హత్యకు కుట్ర జరుగుతుంది. పక్కా స్కెచ్ ప్రకారమే మునుగోడులో దాడి జరిగింది. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెరాస వైఖరిపై ధ్వజమెత్తారు. హుజురాబాద్ లో అవసరం లేకున్నా.. అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆడిస్తే ఆడే.. తోలు బొమ్మలకు, చెంచాలకు బీజేపీ భయపడదని హెచ్చరించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమితో నాపై సీఎం కేసీఆర్ పగ పట్టారు. మునుగోడులో కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఒక్క కారుతో అర్ధరాత్రి కూడా తిరిగే వాళ్ళం. నయీం ముఠా బెదిరించిన భయపడలేదని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. కెసిఆర్ హయాంలో భయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. నా భార్య జమున తన సొంత ఊళ్ళో ప్రచారానికి వెళితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్ దాడులను చూస్తూ ఊరుకోమని, దేశాన్ని పాలిస్తోన్న పార్టీలో నేను సభ్యడినన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పథకం ప్రకారం నా కాన్వాయ్ పై దాడి చేశారు. అనేక సార్లు నా కాన్వాయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. పలివేల గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని సైతం అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏమీ చేస్తోందని ప్రశ్నించారు. నా గన్ మెన్లు లేకపోతే నా తలకాయ ఉండకపోయేది. నా పీఆర్ఓ చైతన్య, గన్ మెన్ అంజయ్యలకు గాయాలయ్యాయని ఈటెల రాజేందర్ తెలిపారు. నిన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి డీఎస్పీని కొట్టారు. డీజీపీ పోలీసు విలువలు కాపాడటంలో విఫలమయ్యారని విమర్శించారు.

ఎన్నికలు జరిగే ప్రాంతంలో మంత్రి పట్టపగలు మద్యం తాగుతూ తాగిపించడం ఏంటని ఈటెల రాజేందర్ అడిగారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి ఏమైంది కేసీఆర్. 9 ఏళ్లలో ఏమీ చెయ్యనీ కేసీఆర్ మొన్న మునుగోడు కు వచ్చి 15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రిని కడతా, రోడ్లు వేయిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. పిచ్చివేషాలు, దౌర్జన్యాలు అపకపోతే ప్రజలే బొంద పెడతారన్నారు. మా మీటింగ్ దగ్గరికి టీఆర్ఎస్ నాయకులు రావచ్చా ? మా మీటింగ్ దగ్గరకు వచ్చి దాడిచేసి.. మాపై దాడి చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సమావేశం దగ్గరికి వంద మంది బిజెపి కార్యకర్తలు వెళ్ళితే ఊరుకుంటారా ? బిడ్డ చంపుతావా ? చంపి బట్టకడుతవా ? నాపై ఈగ వాలితే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఈటెల రాజేందర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్