వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి నాయకత్వం ఈ రోజు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్టు పార్టీ క్రమశిక్షణ సంఘం కార్యదర్శి ఓం పాఠక్ ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగించింది.
అయితే పార్టీ నాయకత్వం తనపై చర్యలు తీసుకోధనే నమ్మకం ఉందని రాజా సింగ్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆశీర్వాదం తనకు ఉందని, ఒకవేళ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకున్నా తాను సాధారణ బిజెపి కార్యకర్తగా పనిచేస్తానని రాజా సింగ్ వెల్లడించారు. తన వీడియో అంశాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్థించుకున్నారు. తాను ధర్మం కోసం నిలబడ్డానని, ధర్మ పోరాటంలో ప్రాణాలు పోయినా పరవాలేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. త్వరలోనే మరో వీడియో విడుదల చేస్తానని రాజ సింగ్ వెల్లడించారు.
Also Read : పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్