రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, ఆదాయం లేని రాష్ట్రానికి అప్పులు ఎలా పుడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సి మాధవ్ మాట్లాడుతూ భవిష్యత్ ఆదాయంపై… ఇప్పుడు అప్పులు చెయ్యడం ఎక్కడా లేదని మండిపడ్డారు. మద్యంపై ఆదాయం వస్తుందని…. బ్యాంకు నుంచి అప్పులు చేస్తున్నారని, కేంద్రం శాఖలకు ఇచ్చే నిధులను రాష్ట్ర పధకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఆర్ధిక తప్పిదాలపై కేంద్ర వ్యవస్థలకు బీజేపీ ఫిర్యాదు చేస్తుందని, మద్యం అమ్మకాలపైనే రాష్ట్ర ఆర్థిక పరిస్తితి కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. మద్య పాన నిషేధం అన్నారు…. మద్యం పై హామీ ఇచ్చి అప్పులు తెస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పులు చేస్తున్న IAS లు కూడా శిక్ష అనుభవిస్తారని ఎమ్మెల్సీ మాధవ్ హెచ్చరించారు.