Friday, March 20, 2026
HomeTrending NewsKarnataka: కర్ణాటకతో కాంగ్రెస్ ఊహలు... గుత్తా ఎద్దేవా

Karnataka: కర్ణాటకతో కాంగ్రెస్ ఊహలు… గుత్తా ఎద్దేవా

కర్ణాటక లో చిత్తుగా ఓడినా,బీజేపీ వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. మత కల్లోలాలు లేపి ఎలాగైనా అధికారంలోకి రావలన్నదే బీజేపీ పార్టీ కుట్ర అని గుత్తా ఆరోపించారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కు కూడా ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. నాలుగు రోజులైనా ఇంకా కర్ణాటక లో సీఎం ని నిర్ణయించే స్వేచ్ఛ ఆ పార్టీ లో లేదని, ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాంటి నాయకత్వం వహిస్తుందో అనేది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఊహల్లో తెలియాడుతున్నారని గుత్తా ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పప్పులు ఉడకవని, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ సమాజం నడుస్తుందన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ కల్లోలం చూస్తూనే ఉన్నాం..అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే తిరుగు బాటు చేసి, రాజకీయ అస్థిరత్వం తెచ్చారని అన్నారు. మతోన్మాద బీజేపికి, దిక్కు దివానా లేని కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. కర్ణాటకలో బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, అంతర్గత విభేదాలతో నానాటికి కాంగ్రెస్ పార్టీ కునారిల్లి పోతుందన్నారు. కె .సీ.ఆర్ నాయకత్వంలోనే దేశం ,రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular